ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్

అనకాపల్లి, అక్టోబర్ 21:ఎన్నికల నిర్వహణలో అధికారులు అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జిల్లా స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గత ఘటనలు, కేసుల వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎస్హెచ్ఓలు, తహసీల్దార్ల నుంచి సేకరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్గ, మండల పటాల ఆధారంగా సున్నిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, ముఖ్యంగా...