కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
ముఖ్యమైన పాయింట్స్:108వ డివిజన్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారంపాల్గొన్న గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర అనకాపల్లి (ప్రజామద్ర ప్రతినిధి):అనకాపల్లి పట్టణం 108వ వార్డు పరిధిలో కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొణతాల సింధుజకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర కూటమి నాయకులతో కలిసి గురువారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మళ్ళా సురేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను...