ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా

ముఖ్యమైన పాయింట్స్:నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పహారా100 మీటర్ల పరిధిలోకి నలుగురికే ప్రవేశంబుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన అనకాపల్లి, అక్టోబర్ 22 (ప్రజాముద్ర ప్రతినిధి): జిల్లాలో జరుగుతున్న ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరిన నేపథ్యంలో బుధవారం ఆయన బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండల పరిషత్ కార్యాలయాలు (MPDO), జిల్లా పరిషత్ కార్యాలయ పరిసరాల్లోని నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల...