ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ- ట్రాఫిక్ సీఐ కె. నాగేశ్వరరావు
ముఖ్యమైన పాయింట్స్:ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.✔️ మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు.✔️ అతివేగం, ట్రిపుల్ రైడింగ్ ప్రాణాంతకం.✔️ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి.✔️ బస్సులు, ఆటోలు ఎక్కేటప్పుడు/దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అనకాపల్లి:(ప్రజాముద్ర ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడిమడక జంక్షన్ వద్ద వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు అనకాపల్లి ఎస్డీపీవోల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ శ్రీ కె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి...