పెద్దేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత.. లోతట్టు ప్రాంతాలకు తీవ్ర హెచ్చరికలు!
ముఖ్యమైన పాయింట్స్:ఆర్నాబ్’ తుపానుతో పోటెత్తుతున్న వరద నీరు.. దిగువకు భారీగా విడుదల6 మండలాల పరిధిలోని గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లి:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నాబ్’ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఒక...