అర్ణబ్ తుపాను బీభత్సం: జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ వృక్షాలు!
ముఖ్యమైన పాయింట్స్:స్తంభించిన రాకపోకలు.. వర్షంలోనూ రంగంలోకి దిగిన పోలీసులు, అధికార యంత్రాంగంయుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు.. ట్రాఫిక్ పునరుద్ధరణ అనకాపల్లి క్రైమ్ బ్యూరో: అర్ణబ్ తుపాను ప్రభావంతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర గాలుల ధాటికి మంగళవారం రాత్రి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డైట్ కాలేజీ వద్ద 20 నిమిషాల్లోనే క్లియరెన్స్ అనకాపల్లి నేషనల్ హైవేపై డైట్ (DIET) ఇంజనీరింగ్...