అనకాపల్లిలో ఎన్నికల వేడి: అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు రూ.2 కోట్ల నిధులు
ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లిలో ఎన్నికల వేడి: అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు రూ.2 కోట్ల బోనస్ – ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సంచలన హామీ అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అనకాపల్లి జీవీఎంసీ (GVMC) పరిధిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థుల విజయాన్ని సులభతరం చేయడంతో పాటు, వారిలో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వార్డుకు ప్రభుత్వం కేటాయించే సాధారణ నిధులకు అదనంగా రూ. 2 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వం రావాలి అనకాపల్లి పరిధిలోని ఆరు వార్డుల్లో...