ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి
ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లిలో ట్రాఫిక్ సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించండి• రోడ్లమీదకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు• జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిద్ధార్థ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. అనకాపల్లి (ప్రజాముద్ర ప్రతినిధి): అనకాపల్లి జీవీఎంసీలో విలీనమై, నూతన జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న జిల్లా, పట్టణ ప్రజలకు తక్షణమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు, సీనియర్ సిటిజన్లు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన...