అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి

ముఖ్యమైన పాయింట్స్:అనకాపల్లి మండల అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వండి​బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి​కొత్తూరు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, కరపత్రాల పంపిణీ అనకాపల్లి:(ప్రజాముద్ర) మండల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల శాశ్వత పరిష్కారానికి జడ్పీటీసీగా తనకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) బలపరిచిన అభ్యర్థి సూదికొండ మాణిక్యాలరావు ప్రజలను కోరారు. ​మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుంటూ ఎన్నికల ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు....