కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ

ముఖ్యమైన పాయింట్స్:కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పీలా గోవింద సత్యనారాయణ​సంక్షేమం, అభివృద్ధే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం​స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి​107, 110 వార్డుల సమావేశాల్లో ఎమ్మెల్యే కొణతాల, మాజీ ఎమ్మెల్యే పీలా అనకాపల్లి, ప్రజాముద్ర ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి పరిధిలోని 107వ వార్డు సిరసపల్లి, 110వ వార్డు రోటరీ క్లబ్ వద్ద నిర్వహించిన అవగాహన సదస్సుల్లో స్థానిక శాసనసభ్యులు...