విజయం సాధించాలంటే ఇవే ముఖ్యం: యువతకు ముఖేష్ అంబానీ 3 సూత్రాలు
ముంబై: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, వ్యాపార రంగంలో లేదా కెరీర్లో గొప్ప విజయాలు సాధించడానికి పెద్ద ఆలోచనలతో పాటు నిరంతర శ్రమ ఎంతో అవసరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. తన జీవిత ప్రయాణంలో నేర్చుకున్న మూడు ప్రాథమిక విజయ సూత్రాలను ఆయన యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు. 1. లక్ష్యంపైనే దృష్టి – అడ్డంకులు దాటే మార్గం "మొదటగా పెద్ద కలలు కనండి. మీ ఆలోచన ఎల్లప్పుడూ తుది లక్ష్యంపైనే స్థిరంగా ఉండాలి" అని అంబానీ పేర్కొన్నారు. ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని మరువకుండా ముందడుగు వేస్తే వాటన్నింటినీ అధిగమించవచ్చని, అలా కాకుండా అడ్డంకుల గురించే...