రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్ విజయ కృష్ణన్

అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ ​ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్ విజయ కృష్ణన్ ​అనకాపల్లి, నవంబర్ 1: అనకాపల్లి జిల్లా పరిధిలోని నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీలతో పాటు జీవీఎంసీ వార్డుల ఎన్నికల పోలింగ్ ఆదివారం అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, జిల్లాలో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ​రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా సాగింది....