పిల్లల పెంపకంలో ప్రేమ ఉండాలి.. గారాబం కాదు!

రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానవీయ దాడి వంటి ఘటనలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలకు వ్యక్తిగత బాధ్యతతో పాటు సమాజంలో తగ్గిపోతున్న మానవతా విలువలు కూడా ఒక కారణమని భావించాల్సి ఉంది. పిల్లల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, ఇతరుల పట్ల గౌరవం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. పిల్లలపై ప్రేమ చూపించడం ఎంత ముఖ్యమో, అతిగా గారాబం చేయకుండా తప్పొప్పులను వివరించడం కూడా అంతే ముఖ్యం. పిల్లల్లో వస్తున్న శారీరక, మానసిక మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. వారి భావాలను అర్థం చేసుకుని, అవసరమైనప్పుడు సరైన మార్గదర్శకత్వం అందించాలి. గెలుపుతో పాటు ఓటమిని స్వీకరించే మనస్తత్వాన్ని నేర్పాలి. ఇతర పిల్లలతో పోల్చకుండా ప్రతి...