విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలి ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ తరఫున ఆర్థిక సాయం బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్
ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలిప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ తరఫున ఆర్థిక సాయంబెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించిన వైఎస్ జగన్ బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో దాడికి గురై బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలోకి ఎలక్ట్రికల్ రంపంతో ఓ వ్యక్తి ప్రవేశించి విద్యార్థినులపై దాడికి పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే...