నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి విజయం

ముఖ్యమైన పాయింట్స్:నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి విజయం11,519 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత అనకాపల్లి, నవంబర్ 3 (ప్రజాముద్ర): నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల పద్మావతి విజయం సాధించారు. మొత్తం 35,765 ఓట్లు పోలవగా, పద్మావతికి 23,028 ఓట్లు లభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకాయల అనితకు 11,573 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి చిట్టి శివ సంధ్యారాణికి 191 ఓట్లు పోలయ్యాయి. వీటితో పాటు 573 ఓట్లు చెల్లనివిగా నమోదవగా, 400 ఓట్లు నోటాకు పడ్డాయి. దీంతో చింతకాయల పద్మావతి 11,519 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం...