పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన రొంగలివానిపాలెం గ్రామస్తులు

ముఖ్యమైన పాయింట్స్:సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్‌పై నిరసనపరిషత్ ఎన్నికలను బహిష్కరించిన రొంగలివానిపాలెం గ్రామస్తులు821 మంది ఓటర్లలో ఎస్సీలు తొమ్మిది మందే! 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపుపై అభ్యంతరం. ఓటింగ్ కోసం రోజంతా వేచి చూసి వెనుదిరిగిన పోలింగ్ సిబ్బంది. అనకాపల్లి, నవంబర్ 5 (ప్రజాముద్ర): గ్రామ సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడాన్ని నిరసిస్తూ అనకాపల్లి మండలం రొంగలివానిపాలెం గ్రామస్తులు గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామస్తులంతా ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరీక్షించి, చివరకు పోలింగ్ సామగ్రితో వెనుదిరిగారు. అసలు పోలింగ్...