మాతృభూమి సేవా సంఘం సేవలు ప్రశంసనీయం
ముఖ్యమైన పాయింట్స్:మాతృభూమి సేవా సంఘం సేవలు ప్రశంసనీయంలోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీడాక్టర్ అపర్ణకు ఘన సత్కారం అనకాపల్లి , నవంబర్ 6: ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాతృభూమి సేవా సంఘం సేవలు కొనియాడదగినవని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. శుక్రవారం దేవీపురంలో మాతృభూమి సేవా సంఘం సభ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ సమాజ హితమే ధ్యేయంగా పనిచేస్తున్న మాతృభూమి సేవా సంఘం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు మాట్లాడుతూ.. ఎలాంటి లాభాపేక్ష...