శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక ధనలక్ష్మి పూజలు

ముఖ్యమైన పాయింట్స్:శ్రీ నూకాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక ధనలక్ష్మి పూజలుఆశ్వయుజ ధన త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలుభారీగా పాల్గొన్న మహిళా భక్తులు అనకాపల్లి (గవరపాలెం): ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనకాపల్లి గవరపాలెంలో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆశ్వయుజ మాసం ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం సామూహిక ధనలక్ష్మి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కల్యాణ/పూజా మండపంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తిపరవశంతో కళకళలాడింది. పూజానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ...