డైట్లో ఘనంగా దీపావళి వేడుకలు
ముఖ్యమైన పాయింట్స్:డైట్లో ఘనంగా దీపావళి వేడుకలుదీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ దాడి రత్నాకర్ అనకాపల్లి: దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (DIET - అటానమస్) కళాశాలలో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కళాశాల ‘లిటరరీ & కల్చరల్ కమిటీ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు రంగోలి (మండల ఆర్ట్స్), ప్రమిదల అలంకరణ (దియా పెయింటింగ్స్) వంటి పలు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మకతను చాటారు. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. వైకుంఠ రావు దీపావళి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను...