హైదరాబాద్‌లో భారీ సైబర్ దాడి.. గంటలోనే రూ.7 కోట్లకు పైగా మాయం!

ముఖ్యమైన పాయింట్స్:నానక్‌రామ్‌గూడకు చెందిన ఫైనాన్స్ సంస్థ ఖాతాపై సైబర్ నేరగాళ్ల కన్ను.. 39 అనధికార లావాదేవీలు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్, నవంబర్ 8:సైబర్ నేరగాళ్లు మరోసారి తమ ప్రతాపాన్ని చూపించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) కార్పొరేట్ బ్యాంకు ఖాతాను లక్ష్యంగా చేసుకుని కేవలం గంట వ్యవధిలోనే రూ.7 కోట్లకు పైగా నగదును అక్రమంగా బదిలీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు బదిలీ కావడంతో సంస్థ ప్రతినిధులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. 39 లావాదేవీల ద్వారా నగదు బదిలీ అందుబాటులో ఉన్న...