విశాఖలో భారత్–అమెరికా సైనిక విన్యాసాలు విజయవంతం.. ముగిసిన ‘టైగర్ ట్రయంఫ్–2026’!

ముఖ్యమైన పాయింట్స్:ఆరు రోజుల పాటు కొనసాగిన సంయుక్త కార్యక్రమం.. విపత్తుల సమయంలో సమన్వయంతో సహాయక చర్యలే లక్ష్యం.. తొలిసారిగా పాల్గొన్న జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) విశాఖపట్నం, నవంబర్ 8:ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం అంతర్జాతీయ రక్షణ రంగంలో మరోసారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్, అమెరికా దేశాల సాయుధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఐదో విడత త్రివిధ దళాల విన్యాసాలు ‘ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్–2026’ విజయవంతంగా ముగిశాయి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం వేదికైంది. విపత్తుల సమయంలో సమన్వయమే ప్రధాన లక్ష్యం భారత్, అమెరికా సైనిక బలగాల మధ్య పరస్పర సమన్వయం, సమాచార మార్పిడి, విపత్తుల సమయంలో...