ఏపీలో వైద్య విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 161 పీజీ సీట్లు!

ముఖ్యమైన పాయింట్స్:11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనపు సీట్లకు ఎన్ఎంసీ ఆమోదం.. 15 వైద్య విభాగాల్లో స్పెషలైజేషన్ చేసే అవకాశం విజయవాడ: వైద్య విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్య సీట్ల సంఖ్య మరింత పెరిగింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అదనంగా 161 పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. 15 విభాగాల్లో కొత్త సీట్లు వివిధ వైద్య స్పెషాలిటీల్లో ఈ అదనపు సీట్లను కేటాయించారు. ఆర్థోపెడిక్స్ విభాగానికి అత్యధికంగా 27 సీట్లు మంజూరయ్యాయి. డెర్మటాలజీ, ఈఎన్టీ, పాథాలజీ విభాగాలకు ఒక్కొక్కటికి 16 సీట్లు...