ఏపీ పదో తరగతి విద్యార్థులకు కీలక అలర్ట్.. నవంబర్ 11 నుంచి పరీక్ష ఫీజుల స్వీకరణ!

ముఖ్యమైన పాయింట్స్:మార్చి 2027లో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు ఫీజుల షెడ్యూల్ విడుదల.. ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు అవకాశం.. పాఠశాల లాగిన్ ద్వారానే చెల్లింపులు! అమరావతి, నవంబర్ 9 (ప్రజా ముద్ర): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారం అందించింది. 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 11 నుంచి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ షెడ్యూల్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఒకసారి పరీక్షలో తప్పి తిరిగి హాజరయ్యే విద్యార్థులకు కూడా...