ఏపీలో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 11 నుంచి దరఖాస్తులు!

ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అవకాశం.. నవంబర్ 30 వరకు అప్లికేషన్లు.. డిసెంబర్ 20 నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు! అమరావతి, నవంబర్ 9 (ప్రజా ముద్ర): ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అవకాశం లభించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ–2026 (APTRT–2026) నియామకాలకు సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలతో పాటు ప్రత్యేక విద్యా సంస్థలు, గురుకులాలు, ఇతర విద్యాసంస్థల్లో ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం...