ఏపీలో తుఫాన్ దెబ్బకు రైతులకు భారీ నష్టం.. పరిహారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి!

ముఖ్యమైన పాయింట్స్:మురసు తుఫాన్‌తో 1.86 లక్షల మంది రైతులపై ప్రభావం.. 1.43 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.. కేంద్ర సాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం! అమరావతి, నవంబర్ 9 (ప్రజా ముద్ర): వరుస తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా మురసు తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఇప్పటికే పంట పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. 1.86 లక్షల మంది రైతులపై తుఫాన్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన...