యువత భవిష్యత్తును మింగేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారి!
ముఖ్యమైన పాయింట్స్:సరదాగా మొదలై వ్యసనంగా మారుతున్న అలవాటు.. చదువు, ఆరోగ్యం, కుటుంబ బంధాలపై తీవ్ర ప్రభావం.. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై! ప్రత్యేక కథనం – ప్రజా ముద్ర నేటి యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక. చదువు, ఉద్యోగం, నైపుణ్యాలు, ఆవిష్కరణలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన యువతలో కొందరు మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మొదట సరదాగా, స్నేహితుల ఒత్తిడితో లేదా కొత్త అనుభూతి కోసం మొదలయ్యే అలవాటు.. క్రమంగా వ్యసనంగా మారి జీవితాలనే ప్రమాదంలోకి నెడుతోంది. స్నేహం పేరుతో మొదలై.. వ్యసనంగా మారి! కొంతమంది యువత చెడు స్నేహాలు, తోటివారి ఒత్తిడి, మానసిక ఒత్తిడి, నిరాశ, ఆసక్తి వంటి కారణాలతో మాదకద్రవ్యాల...