మనీ మంత్ర: డబ్బు సంపాదనతోనే సరిపెట్టొద్దు.. సంపద సృష్టించేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!
ముఖ్యమైన పాయింట్స్:చేతిలోకి వచ్చే ఆదాయాన్ని ఎలా నిర్వహించాలి? ఖర్చుల నియంత్రణ నుంచి పెట్టుబడుల వరకు ఆర్థిక విజయానికి ఉపయోగపడే సూచనలు.. చిన్న పొదుపుతో భవిష్యత్తుకు భరోసా! ప్రత్యేక కథనం | ప్రజా ముద్ర నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం పెరుగుతోంది. పెరుగుతున్న ధరలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, భవిష్యత్తు అవసరాలు.. ఇలా ఎన్నో అంశాలు సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత సంపాదిస్తున్నామన్నది మాత్రమే కాదు.. సంపాదించిన మొత్తాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నామన్నది కూడా కీలకంగా మారింది. చాలామంది మంచి ఆదాయం ఉన్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదని ఆందోళన చెందుతుంటారు. దీనికి...