విశాఖ వేదికగా ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల సందడి.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా CII అంతర్జాతీయ సదస్సు!
ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో ప్రతిష్ఠాత్మక భాగస్వామ్య సదస్సు.. 59 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధుల రాకకు ఏర్పాట్లు.. ఏపీ పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలపై ఆశలు! విశాఖపట్నం: అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చే దిశగా విశాఖపట్నం మరో కీలక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 12, 13 తేదీల్లో 31వ CII భాగస్వామ్య సదస్సు (Partnership Summit 2026) జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ వేదికపై సమావేశం కానుండటంతో విశాఖలో పారిశ్రామిక వాతావరణం వేడెక్కుతోంది. ప్రపంచ దేశాల చూపు విశాఖ వైపు ఈ అంతర్జాతీయ సమావేశానికి దాదాపు 59 దేశాల...