ఏపీలో భూగర్భ జలాల కాలుష్యం.. నైట్రేట్, ఫ్లోరైడ్‌పై ఆందోళన

ముఖ్యమైన పాయింట్స్:నైట్రేట్, ఫ్లోరైడ్, యురేనియం స్థాయులు అధికంగా ఉన్నట్లు గుర్తింపు.. బోరు నీటి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం విశాఖపట్నం, నవంబర్ 10 (ప్రజా ముద్ర): ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ జలాల నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల పరీక్షల్లో కొన్ని హానికర రసాయన మూలకాల స్థాయులు నిర్దేశిత ప్రమాణాలను మించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా నైట్రేట్, ఫ్లోరైడ్, యురేనియం వంటి మూలకాల ఉనికి ప్రజారోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర భూగర్భ జల మండలి (CGWB) నివేదికలో పొందుపరిచిన గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో పరిశీలించిన 358 నమూనా కేంద్రాల్లో నైట్రేట్ స్థాయులు అనుమతించదగిన పరిమితిని మించాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బోరు...