గర్భిణులకు జన చైతన్య సమితి సేవలు అభినందనీయం
ముఖ్యమైన పాయింట్స్:మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణకు పోషకాహార పంపిణీ ఎంతో ఉపయోగకరం: డాక్టర్ జి. సరస్వతి అమరావతి, నవంబర్ 9: గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు జన చైతన్య సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ జి. సరస్వతి పేర్కొన్నారు. గర్భిణులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. జన చైతన్య సమితి ఆధ్వర్యంలో పెదకూరపాడుకు చెందిన నెలకుదుటి వెంకట రామారావు (నాని) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన సహకారంతో సోమవారం అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సరస్వతి...