మూడు విడతల సర్పంచ్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ముఖ్యమైన పాయింట్స్:ఎన్నికల నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలి.. అధికారులకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాలు అనకాపల్లి, నవంబర్ 10: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం వెబెక్స్ వేదికగా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు....