డైట్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళి

అనకాపల్లి, నవంబర్ 11 (ప్రజా ముద్ర): జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలోని దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం దేశ విద్యారంగ అభివృద్ధికి ఆజాద్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశ విద్యావ్యవస్థ పటిష్టతకు పునాదులు వేసిన ప్రముఖుల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒకరని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది సమాజ పురోగతికి,...