జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆజాద్‌కు అనకాపల్లి జిల్లా పోలీసుల ఘన నివాళి

ముఖ్యమైన పాయింట్స్:ఆజాద్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి, నవంబర్ 11: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యావేత్తగా, రచయితగా దేశానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు, దేశంలో ఐక్యత,...