అర్హులైన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌తో ఆర్థిక భరోసా
ముఖ్యమైన పాయింట్స్:వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం – పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి, నవంబర్ 11: అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ వైద్య చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) అండగా నిలుస్తోందని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలా గోవింద...