సంపతిపురంలో 626 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:రీ సర్వేతో భూ యజమానులకు స్పష్టమైన హక్కులు.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి, నవంబర్ 11: భూ యజమానులకు భూములపై స్పష్టమైన హక్కులు కల్పించడంతో పాటు, భూ వివాదాలకు పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రక్రియలో భాగంగా సంపతిపురం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో రీ సర్వే పూర్తయిన నేపథ్యంలో మొత్తం 626 ఖాతాలకు సంబంధించి 626 పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం ఉదయం అర్హులైన భూ యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడంతో...