గంజాయి అక్రమ రవాణాదారుడిపై PIT NDPS చట్టం ప్రయోగం

ముఖ్యమైన పాయింట్స్:పాత కేసుల నేపథ్యంలో నిందితుడిపై నిర్బంధ ఉత్తర్వులు.. విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు అనకాపల్లి, నవంబర్ 11: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PIT NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టగా, పాయకరావుపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శివపురానికి చెందిన గొర్లి నానాజీ అలియాస్ నాయుడు (27) గతంలో పలు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో కేసులు నమోదైనప్పటికీ గంజాయి...