మొబైల్ వినియోగదారులకు షాక్.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల ధరలు 30 శాతం పెరిగే అవకాశం!

ముఖ్యమైన పాయింట్స్:ఏఐ (AI) రంగం నుంచి పెరిగిన మెమరీ చిప్‌ల డిమాండ్.. తయారీ ఖర్చుల భారంతో ఫోన్ ధరలకు రెక్కలు! న్యూఢిల్లీ, నవంబర్ 11: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు ధరల పెరుగుదల రూపంలో మరో షాక్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా పెరుగుతున్న పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణ కారణంగా మెమరీ చిప్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలపై ఉత్పత్తి వ్యయాల భారం పెరుగుతోంది. ఈ ప్రభావం ముఖ్యంగా తక్కువ ధరకు లభించే బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్లపై ఎక్కువగా ఉండవచ్చని మార్కెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. 30 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం...