అగ్నిప్రమాద బాధిత నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

ముఖ్యమైన పాయింట్స్:కొండకొప్పాకలో రెండు ఇళ్లు దగ్ధం.. బాధితులకు సీపీఎం బృందం నిత్యావసర సరుకులు, వంట సామగ్రి పంపిణీ అనకాపల్లి, నవంబర్ 11: అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అనకాపల్లి మండలం కొండకొప్పాక ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో మామిడి నరసమ్మ, కొలుసు అప్పారావుకు చెందిన రెండు రేకుల ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రెండు కుటుంబాలు ఇళ్లతో పాటు ఇంట్లోని సామగ్రిని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుల బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించింది....