తాళ్లపాలెంలో ఎన్నికల నియమావళిపై పోలీసుల అవగాహన

ముఖ్యమైన పాయింట్స్:నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక -సీఐ స్వామి నాయుడు కసింకోట, నవంబర్ 11 (ప్రజా ముద్ర): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో పోలీసులు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా (ఐపీఎస్), అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు ఆదేశాల మేరకు కసింకోట సీఐ స్వామి నాయుడు, ఎస్సై లక్ష్మణ్ రావు గ్రామాన్ని సందర్శించి స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల సమయంలో పాటించాల్సిన...