విశాఖలో ఘనంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
ముఖ్యమైన పాయింట్స్:58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధుల హాజరు – వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలే ప్రధాన అజెండా విశాఖపట్నం: విశాఖ నగరంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు–2026 ఘనంగా ప్రారంభమైంది. ‘నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్’ (Navigating the New World Order) అనే ఇతివృత్తంతో భారత పరిశ్రమల సమాఖ్య ఈ సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు...