పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌ల పేరుతో ప్రచార ఆర్భాటం.. ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు

ముఖ్యమైన పాయింట్స్:ఎంఓయూల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై సమాధానం చెప్పాలి.. విశాఖ భూ కేటాయింపులపై తీవ్ర ఆరోపణలు విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌లు అభివృద్ధి కంటే ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల ప్రకటనలు, ఉద్యోగాల హామీలు, విశాఖలో భూ కేటాయింపులపై పలు ప్రశ్నలు సంధించారు. ఎంఓయూల అమలుపై శ్వేతపత్రం ఎక్కడ? పెట్టుబడుల పేరుతో లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోందని, అయితే గతంలో కుదుర్చుకున్న...