ఏపీలో పెట్టుబడిదారులకు చట్టపరమైన భరోసా.. ప్రత్యేక చట్టం దిశగా చంద్రబాబు ప్రభుత్వం!

ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక ఒప్పందాలకు రక్షణ.. ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చే హామీలకు చట్టబద్ధమైన భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31వ CII భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ గతంలో పరిశ్రమలకు ఇచ్చిన హామీలు, ఒప్పందాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నదే ఈ ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశమని స్పష్టం...