అనకాపల్లి నిదానం దొడ్డిలో శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలకు శ్రీకారం
ముఖ్యమైన పాయింట్స్:తొలి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాడి రత్నాకర్, మళ్ల సురేంద్ర అనకాపల్లి: అనకాపల్లి నిదానం దొడ్డిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవంబర్ 23, 2026న నిర్వహించనున్న జయంతి వేడుకలను పురస్కరించుకుని పది రోజులపాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీ సత్యసాయి బాబా వారి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక...