నెల రోజుల చిన్నారికి ప్రపంచ రికార్డు గుర్తింపు
ముఖ్యమైన పాయింట్స్:పుట్టుకతోనే 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన ఒత్తైన జుట్టు.. ఉమ్మలాడ గ్రామానికి గర్వకారణంగా యాసిక శ్రీ అనకాపల్లి: సాధారణంగా చిన్నారులు పుట్టినప్పుడు తక్కువ జుట్టుతో కనిపిస్తారు. అయితే అనకాపల్లి జిల్లాకు చెందిన నెల రోజుల పసికందు పుట్టుకతోనే పొడవైన, ఒత్తైన జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డు గుర్తింపును సైతం అందుకుని వార్తల్లో నిలిచింది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన యాసిక శ్రీ అనే చిన్నారి ఈ అరుదైన గుర్తింపును సాధించింది. సెప్టెంబర్ నెలలో అనకాపల్లి పట్టణంలోని ఘోషా ఆసుపత్రిలో జన్మించిన ఈ పాపకు పుట్టుకతోనే సుమారు 6 నుంచి 7 సెంటీమీటర్ల...