మధుమేహంపై ముందస్తు చర్యలతో వ్యాధి నియంత్రణ సాధ్యం

ముఖ్యమైన పాయింట్స్:ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లిలో అవగాహన కార్యక్రమం – రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని వైద్యుల సూచన అనకాపల్లి, నవంబర్ 14: మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, వ్యాధిని ముందస్తుగా గుర్తించి నియంత్రించాలనే లక్ష్యంతో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, వ్యాధి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని “మధుమేహంపై ముందస్తు చర్యలు (Early...