ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు భారీ ప్రోత్సాహకాలు.. గరిష్ఠంగా రూ.50 లక్షలు!

అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌లో 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1111, తేదీ 13-11-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించింది. జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలు ఇలా.. - 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు. - 5,001 నుంచి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు. - 10,000కు...