పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ముఖ్య సమాచారం.. ఖర్చు పరిమితులు, డిపాజిట్ వివరాలు ఇవే!
అనకాపల్లి, నవంబర్ 14: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల వ్యయ పరిమితులు, నామినేషన్ సమయంలో చెల్లించాల్సిన ధరావతు మొత్తాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 అక్టోబర్ 10న నోటిఫికేషన్ నంబర్లు 566/SEC-B1/2026, 567/SEC-B1/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి: - 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.50 లక్షలు. - 10 వేల లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.4 లక్షలు. వార్డు సభ్యుల ఎన్నికల వ్యయ పరిమితి: - 10 వేలలోపు...