రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపిక

ముఖ్యమైన పాయింట్స్:అండర్-14 ఎపీ విభాగంలో విశాఖ జిల్లా తరఫున ప్రాతినిధ్యం పరవాడ, నవంబర్ 14: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలకు పరవాడకు చెందిన యువ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్ర స్థాయి బరిలో నిలిచాడు. నవంబర్ 14న అనకాపల్లి మండలం మామిడిపాలెంలోని పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన విశాఖపట్నం జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో దుష్యంత్ ప్రతిభ కనబరిచాడు. దీంతో అండర్-14 బాలుర ఎపీ (Epee) విభాగంలో జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 21, 22 తేదీల్లో...