కార్తీక మాసంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యమైన పాయింట్స్:పుణ్యస్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలి.. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సూచనలు అనకాపల్లి, నవంబర్ 15: కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు, ఆలయాలు, నదీ తీరాలు, సముద్ర తీర ప్రాంతాలకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. పుణ్యస్నానాలు, ఆలయ దర్శనాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల చోటుచేసుకున్న నీటిలో మునిగి మృతి చెందిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్పీ పేర్కొన్నారు. భక్తుల భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు, ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు...