బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీ తీరంవైపు తుఫాను పయనం!
ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 18 నాటికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం.. 19న గంటకు 145 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం విశాఖపట్నం / అనకాపల్లి, నవంబర్ 15 (ప్రజాముద్ర): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతుండటంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులపై ఆందోళన నెలకొంది. భారత వాతావరణ శాఖ (IMD) నవంబర్ 15న విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం ఈ వాయుగుండం రానున్న రోజుల్లో తుఫానుగా, అనంతరం తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 960 కిలోమీటర్ల దూరంలో...